ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా గోల్ కొట్టిన బంతి వేలంలో రూ.19.5 కోట్లకు అమ్ముడుపోయింది. 1986 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ తో క్వార్టర్స్ లో ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన అలీ బిన్ నాసర్ దగ్గర ఆ బంతి ఇప్పటి వరకూ ఉంది. దీన్ని బుధవారం లండన్ లో వేలం వేయగా భారీ ధర పలికింది.