ఉత్తరం ద్వారానే ఓ వ్యక్తి భార్యకు తలాఖ్ చెప్పిన ఘటన యూకే డెహ్రాడూన్ లో వెలుగుచూసింది. 2017 మార్చి 13న బాధితురాలికి హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మోర్ జిల్లా పవంటకు చెందిన మహబూబ్ అలీ అనే వ్యక్తితో వివాహమైంది. కొత్త కాలానికే వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 2022 ఫిబ్రవరి 8న ఆమెను ఇంటి నుంచి బయటకు పంపిన భర్త మే 12న ఓ లెటర్ ద్వారా ముమ్మారు తలాఖ్ చెప్పాడు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించింది.