గుజరాత్ ప్రజలు తమకు ఓ అవకాశం ఇచ్చి చూడాలని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వల్సాద్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆప్ ను గెలిపిస్తే విద్యుత్ బిల్లుల మాఫీ సహా, పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్య సేవలందిస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పిస్తామన్నారు. బీజేపీకి 27 ఏళ్లు అధికారం ఇచ్చారని తమకూ ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరారు.