ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. తునిలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. భవాని మాలలో ఉన్న దుండగుడు బిక్ష తీసుకుంటున్న క్రమంలో కత్తితో శేషగిరిరావుపై దాడి చేశాడు. శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన నిందితుడు బైక్ పై పరారయ్యాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.