సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన జగన్రెడ్డి.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ నేతలు రామానాయుడు, రామరాజు, శివరామరాజు, పుల్లారావు సహా 400 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.