రొయ్యల మేత కంపెనీల నుంచి కమీషన్లు దండుకోవడంపై వైసీపీ ప్రభుత్వానికి ఉన్నశ్రద్ధ... రొయ్యల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేదని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. ‘‘వంద కౌంట్ ఉన్న రొయ్యల మద్దతు ధర ప్రభుత్వం కిలో రూ.240 అని ప్రకటించింది. రేటు పడిపోతే మధ్యలో ఉన్న తేడాను భర్తీ చేయాల్సిందిపోయి మద్దతు ధరను రూ.210కి తగ్గించింది. రేటు పడిపోతే నిలబెడతారా లేక ధరనే తగ్గిస్తారా?’’ అని విమర్శించారు. ఆక్వారైతుల పొట్టకొట్టి, తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకుంటున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు.