మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులు సత్ప్రవర్తన కారణంగా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిని విడుదల చేసినట్లే తననూ విడుదల చేయాలంటూ ఓ ఖైదీ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాడు. 29 ఏళ్లుగా ఒక్క రోజు కూడా బయటకు అడుగుపెట్టకుండా జైలులోనే మగ్గిపోతున్నానని స్వామి శ్రద్ధానంద్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడు పెట్టిన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం ఆమోదించింది.