గ్రామాభివృద్ధిపై అధికారులు దృష్టిసారించాలని, శ్రీకాకుళం జిల్లా, గజపతినగరం మండల ప్రత్యేకాధికారి కె.రమేష్ తెలిపారు. స్థానిక మండలపరిషత్ కార్యాల యంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఇళ్ల పనులు వేగవంతంగా చేయాలన్నారు. ఆర్బీకేలు, గ్రామ సచివాలయాల పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి నివేదికలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కిశోర్‌కుమార్, తహసీల్దార్ అరుణకుమారి, ఈవోపీఆర్డీ డి.జనార్దన రావు పాల్గొన్నారు.