నరసన్నపేట, మాకివలస గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం 0.70 ఎకరాల చెరుకు తోట ఆహుతైంది. చెరుకు తోట మీదుగా విద్యుత్ తీగలు ఉండడంతో గాలికి అవి రాచుకొని నిప్పురవ్వలు పడడంతో మంటలు వ్యాపించాయి. దీనితో పంట కాలి పోయింది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో చెరుకు పంట కోసే సమయంలో ఇలా ప్రమాదం జరగడంతో బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు.