అన్నదాతలను ఆదుకుంటానని మాటిచ్చి.. తప్పిన సీఎం జగన్ ఏ పరదాల మాటున దాక్కుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. టమోటా పరిస్థితి అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివిలా ఉందన్నారు. ‘మార్కెట్లో కిలో రూ.20కిపైగా అమ్ముతున్న టమోటాను రైతు దగ్గర రూపాయికే కొంటుంటే... అన్నింటికీ జిందా తిలిస్మాత్‌లా పనిచేస్తాయని చెప్పిన జగన్నాటక రైతు భరోసా కేంద్రాలు ఏం చేస్తున్నాయి? సీఎం తీసుకువచ్చిన రైతు రాజ్యం, రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఎలుకలు కొట్టేశాయా? ఉడతలు ఊదేశాయా? టమోటా రైతుకు మద్దతు ధర రాకపోతే పంట భద్రపరచటానికి ఏర్పాటు చేస్తానన్న కోల్డ్ స్టోరేజీలు ఏవి?’’ అంటూ ప్రశ్నించారు.