తెనాలి నియోజకవర్గంలో అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణాను రైతులు అడ్డుకున్నారు. కొల్లిపర మండలం కొత్తబొమ్మువాని పాలెంలో జేపీ సంస్థ తవ్వకాలు చేపట్టింది. రైతులు ఏర్పాటు చేసుకున్న రోడ్డును స్వాధీనం చేసుకొని ఇసుక తవ్వకాలు చేపట్టారు. విషయం తెలిసిన రైతులు గత రాత్రి అక్కడకు చేరుకుని ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. అనుమతులు లేవని నిలదీయటంతో తవ్వకాలు ఆపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కన్నా ఇసుక ఎక్కువ ధరల వసూళ్లకు పాల్పడుతోందని... జేపీ సంస్థ అక్రమ తవ్వకాలు చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.