సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మాజీ ఎంపీ మాగంటి బాబు విమర్శించారు. గుడివాడ రోడ్డులోని క్లాస్ -1 కాంట్రాక్టర్ మల్లంపాటి బెనర్జీ తల్లి సీతారావమ్మ ఇటీవల మృతిచెందారు. సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అప్పులు తెచ్చి అభివృద్ధి పనులకు కేటాయించకుండా సంక్షేమం పేరుతో పంపిణీ చేస్తోందన్నారు. దీంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పడుతోందన్నారు. ఇలాగే కొనసాగితే రాష్ట్రం యావత్తు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సుంకర సుభాష్ చంద్రబోస్, వీరమాచినేని సత్య ప్రసాద్, నందిగం స్వామి, మేడి కొండ బుచ్చిబాపయ్య, వేగిరెడ్డి సూర్యనారాయణ, వేగిరెడ్డి బాలాజీ, మల్లంపాటి అమర్, వీరమాచనేని రామబ్రహ్మం, అట్లూరి శ్రీనివాసరావు, మూల్పూరి సురేంద్ర, పాల్గొన్నారు.