రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవాలే కానీ తప్పుడు కేసులు బనాయించడం తగదని టీడీపీ నాయకుడు జగన్మోహన్ రాజు గురువారం రాయచోటిలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి పైన నమోదు చేసిన తప్పుడు కేసును నిరసిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్ఆర్ రాజకీయ చరిత్రలో భూకబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడింది లేదన్నారు.
కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే వైసీపీ నాయకులు ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇటు వంటి తప్పుడు కేసుల వల్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ భయపడరన్నారు. రమేష్ రెడ్డి, తదితరులపై నమోదు చేసిన తప్పుడు కేసులపై జిల్లా పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచా రణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.