శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఉండవల్లి లోని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా టిడిపి జిల్లా అధ్యక్షులు బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను, ప్రస్తుతం నియోజకవర్గ సమస్యలను, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ చేసిన కార్యక్రమాలను ప్రతి ఒక్కటి వివరించి వినతి పత్రం సమర్పించడం జరిగిందని టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు పేర్కొన్నారు.
రాబోయే కాలంలో చేయవలసిన కార్యక్రమాలను లోకేష్ దిశా నిర్దేశం చేశారని, వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడానికి చేసిన హామీలను నేరువేర్చడంలో విఫలమయిందని ప్రతి సంవత్సరం జనవరిలో నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి విడుదల చేయలేదని 2లక్షల 50 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేస్తామని, చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి అమ్మ ఒడి రూపంలో 15 వేల రూపాయలు విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క వర్గానికి మోసం చేయడం జరిగిందన్నారు.ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ నాయకులు హరీష్, పార్థు యాదవ్, సాయికిరణ్, షబ్బీర్ భాష, నరేష్ తదితరులు పాల్గొన్నారు.