బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి త్వరగా అరగకపోవడంతో వల్ల ఆకలి వేయదు. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. ఓట్స్‌లోని ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఓట్స్ తింటే కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.