గ్రామాల్లో నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వే వలన రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని స్థానిక తహశీల్ధార్ బి. సత్య నారాయణ అన్నారు. మండ లంలోని టెక్కలిపాలెం పంచాయితీలలో గురువారం నిర్వహించిన భూ సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో డ్రోన్ సహకారం తో రైతులకు సంభందించిన ప్రతి అంగుళం భూమి కూడా గుర్తించడం జరుగుతుందన్నారు. దీనివలన ఎటువంటి అన్యాయాలు జరగవని రైతులకు చెందిన భూములకు సరిహద్దులు నిర్ణయించి అప్పగించడం జరుగుతుంద న్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎమ్ పి టి సి లు గ్రామపెద్దలు రైతులు పాల్గొన్నారు.