మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఖోపోలి ప్రాంతానికి సమీపంలో ఓ కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. గాయపడిన వారిని కమోతేలోని ఎంజిఎం ఆసుపత్రిలో చేర్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa