ఆముదాలవలస మండలం పరిధిలో అధికార పార్టీ నాయకుల కు అధికారులు తలోగ్గి కింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నెల్లిపర్తి అంగన్వాడీ టీచర్ పద్మ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం అందించారు. గురువారం రాత్రి ఆముదాలవలస మండలంలో కొర్లకోట గ్రామంలో టీడీపీ బాదుడే బాదుడు నిర్వహించిన సందర్భంగా హాజరైన ఎంపీకి నెల్లిపర్తి అంగన్వాడి టీచర్ను అకారణంగా తొలగించారని ఆమె ఫిర్యాదు చేసారు. దీంతో ఎంపీ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలగించడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారులు ఇలా చేయడం తగదని గతంలో ఇలాంటి చర్యలకు ఎప్పుడు పాలకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలాంటి సంఘటనలుకు పాల్పడలేదని అధికారులు తీరుపై ఘాటుగా స్పందించారు. రానున్న కాలంలో తమ ప్రభుత్వం వస్తే అధికారులు పై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికైనా అధికారులు తీరు మారాలని హితువు పలికారు. ఈయనతోపాటు జిల్లా టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్, జిల్లా టిడిపి నాయకులు మొదలవలస రమేష్ కుమార్ , తమ్మినేని విద్యాసాగర్ రావు కొర్లకోట సర్పంచ్ సనపల. అన్నపూర్ణమ్మ , మండల టిడిపి అధ్యక్షులు నూకరాజు , టిడిపి నాయకులు డిల్లేశ్వరరావు, తమ్మినేని సుజాత , చంద్రశేఖర్, కృష్ణ, జి. రవి లతోపాటు టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.