ఉగ్రవాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో 'నో మనీ ఫర్ టెర్రర్' సదస్సులో మాట్లాడుతూ 'ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమించము. ఒక్క దాడి జరిగినా, ఒక్క ప్రాణం పోయినా అది ఒకటి చాలా ఎక్కువ అని మేము భావిస్తాము. అన్ని ఉగ్రవాద దాడులకు సమాన ఆగ్రహం, ప్రతి చర్య అవసరం. ఉగ్రవాదులను వెంబడించాలి. వారి మద్దతు నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయాలి. వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి' అని అన్నారు.