కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ చేనేత కార్మికులకు అందిస్తున్న సేవలు ఎంతైనా అభినందనీయమని రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్ నుండి వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన వారికి చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం దేశాయిపేటలోని కల్యాణ మండపంలో గురువారం రాత్రి జరిగిన చేనేత పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఆదుకుంటేనే చేనేత కార్మికులు మనుగడ సాగించగలరని చెప్పారు. ముఖ్య అతిథులుగా విశ్రాంత ప్రధానాచార్యులు సత్రం మల్లేశ్వరరావు, జాతీయ చేనేత నాయకులు మాచర్ల మోహనరావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కన్సర్న్ ఇండియా ప్రాజెక్టు లీడ్ రాధ, శ్రీనివాసరావు, కేశవరావు, వారి సిబ్బంది, చేనేతలు పాల్గొన్నారు.