బాలల హక్కుల పరిరక్షణ మనం బాధ్యతని సాయి చైతన్యజూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరెడ్డి అన్నారు. పులివెందుల పట్టణంలోని స్థానిక చైతన్య కళాశాలలో గురువారం రైడ్స్ చైల్డన్ 1098 ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలబాలికలు ఎన్ని సమస్య లొచ్చినా నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. ఆ దిశగా బాలబాలికలు కృషి చేయాలి కోరారు. కో ఆర్డినేటరు జోసఫ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆడ మగ అనే తారతమ్యం లేకుండా అందరూ సమానమేనన్న భావనతో ముందు కెళ్లాలన్నారు. ఎవరి భవిష్యత్‌ను వారే చక్కదిద్దుకోవాల్సిన ఆవశ్యత ఉందన్నారు. బాలల హక్కులు, బాధ్యతలు, విధులు తదితర అంశాలను కమిటీ సభ్యులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో టీమ్ మెంబర్లు భవాణి, మంజులవాణి, పుష్పరాజ్ పాల్గొన్నారు.