రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసేందుకు, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు స్వచ్ఛమైన తేనె ఉపయోగపడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. తేనెలో ఉండే అరుదైన షుగర్లు, ప్రొటీన్లు, కర్బన ఆమ్లాల వంటి సమ్మేళనం ఆరోగ్యానికి చాలా ఉపయోగం. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గించడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించేందుకు, కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో పెట్టేందుకు ఉపకరిస్తాయట.