ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు డిసెంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ ను పొడిగించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఏపీ హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ మంజూరు కోసం డిసెంబర్ 12న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.