జీవీఎంసీ 53 వ వార్డు నరెంధ్రనగర్ ప్రాంతంలో సుమారు 27 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అబివృద్ధి పనులకు విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త , రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె. రాజు శుక్రవారం శంకుస్థాపన చేసారు. ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు అందించేందుకు గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారని అందులో భాగంగా ప్రజ సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే దిశగా ఆయా వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ , ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ గుజ్జు వెంకటరెడ్డి, వైసిపి నాయకులు డాక్టర్ తుల్లి చంద్రశేఖర్ యాదవ్, షేక్ బాబ్జి, ఈదుల రామారావు, హనుమంత్, సదరం జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు.