చిన్నారులపై లైంగిక నేరాల కట్టడికి తీసుకొచ్చిన పోక్సో చట్టానికి పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో చట్టం అమలు, విచారణల్లో జాప్యం వంటి అంశాలపై ‘ఏ డికేడ్ ఆఫ్ పోక్సో’ పేరుతో అధ్యయనం జరిగింది. ప్రతి 3 కేసుల్లో ఒకటికి మాత్రమే శిక్ష ఖరారవుతోందని వెల్లడైంది. ఒక్కో కేసు పరిష్కారానికి 17 నెలలు పడుతుండగా, 18 శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయని అధ్యయనం పేర్కొంది. యూపీలో అధికంగా 77 శాతం కేసులు పెండింగ్ ఉన్నాయని వెల్లడైంది. దాదాపు 2.31 లక్షల కేసులను విశ్లేషించారు.