ప్రతి సంవత్సరం దేశంలోని యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేంద్రం కేవలం 75 వేల నియామకాలను మాత్రమే భర్తీ చేశార్నారు. పీఎంఓ ఆధీనంలో ఉండే కేంద్ర సెక్రటేరియట్‌లో 1,600ల పోస్టులు ఖాళీలున్నాయని, వాటినే భర్తీ చేయలేకపోయారని విమర్శించారు.