అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) శనివారం (నవంబర్ 19) తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. తమ సమస్యల పరిష్కారానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సమ్మతి తెలిపినట్లు ఏఐబీఈఏ పేర్కొంది. చర్చల ద్వారా ఎక్కువ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సమ్మె వాయిదా వేశామని, శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.