రాజస్థాన్ లోని ఓ అడవిలో యువతీ యువకుల మృతదేహాలు ఛిద్రమైన స్థితిలో లభ్యమయ్యాయి. ఉదయ్ పూర్ జిల్లాలోని గోగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉంబ్రేశ్వర్ మహదేవ్ జంగిల్లో ఓ వ్యక్తి, మహిళ మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి ప్రైవేట్ పార్ట్స్ దారుణంగా ఛిద్రమయ్యాయి. ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ జరుగుతుందని ఉదయ్ పూర్ ఎస్పీ వికాస్ శర్మ వెల్లడించారు.