భారత్ లోని 100 అంకుర సంస్థలు ఇస్రోతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. వాటితో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని స్పష్టం చేశారు. దాదాపు 10 సంస్థలు ఇప్పటికే కొన్ని శాటిలైట్స్, రాకెట్స్ తయారు చేశాయని వివరించారు. మరికొన్ని నెలల్లోనే చంద్రయాన్-3 మిషన్ ప్రారంభిస్తామని.. ఇందుకోసం ఇస్రో నాసాతో కలిసి పని చేస్తుందని తెలిపారు. బెంగళూరు టెక్ సమ్మిట్ కు హాజరైన ఆయన ఈ వివరాలు వెల్లడించారు.