బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కొందరు 'పాకిస్తాన్ జిందాబాద్' చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్ కాలేజ్ ఫెస్ట్‌లో ఒక అమ్మాయి, అబ్బాయి పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. వారిని మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఇద్దరినీ కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై పోలీసులు స్పందించి ఐపీసీ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు.