మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలులో ఓ వ్యక్తితో సత్యేంద్ర జైస్ మసాజ్ చేయించుకున్న వీడియోను బీజేపీ శనివారం విడుదల చేసింది. సత్యేంద్ర జైన్‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చిన తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు.