ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో గత మూడు రోజులుగా ఆసుపత్రిలో ఆయన చికిత్స చేయించుకుంటున్నారు. గత రాత్రి ఆయనకు ఆపరేషన్ అయింది. దీంతో ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. 2 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 15 రోజుల తర్వాత కిడ్నీకి సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నారు.