శ్రీశైల మహాక్షేత్రంలో కార్తిక మాసోత్సవాలను పురస్కరించుకుని భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం అధిక సంఖ్యలో భక్తులు భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. గంగాధర మండపం, ఉత్తర, దక్షిణ మాడవీధుల్లో కార్తిక దీపారాధనలు నిర్వహించారు. మరో నాలుగు రోజుల్లో కార్తిక మాసోత్సవాలు ముగియనుండటంతో భక్తులు పెద్దఎత్తున శ్రీగిరికి చేరుకుంటున్నారు. ఆది, సోమవారాల్లో రద్దీ అధికంగా కొనసాగనుంది.