ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విధి రాత అంటే ఇలావుంటుంది....రాత్రికి రాత్రి కోటీశ్వరులయ్యారు

international |  Suryaa Desk  | Published : Sat, Nov 19, 2022, 11:55 PM

ఎవరి జీవితంలో ఏ సమయంలో మలుపు వస్తుందో తెలియదు. అలాంటి ఘటనే బ్రిటన్ లో చోటు చేసుకొంది.  ఇద్దరు దంపతులు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. ఇంటిని మరమ్మతులు చేయించుకుంటున్న సమయంలో సడన్‌గా నిధి కనిపించింది. దాంతో ఆ ఇంటి వాళ్లు ఒక్కసారిగా ధనవంతులైపోయారు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. నార్త్ యార్క్‌షైర్‌లోని ఓ ఇంట్లో ఇద్దరు భార్యభర్తలు పదేళ్లుగా జీవిస్తున్నారు. కానీ ఇటీవల ఆ ఇంట్లో వారు 264 బంగారు నాణాలను గుర్తించారు.


ఆ ఇంటిని మరమ్మతులు చేయించే క్రమంలో ఇంటి కప్పులో, వంట గదిలోని భూమిలో పాతిపెట్టిన నిధి బయటపడింది. మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఆ దంపతులకు అకస్మాత్తుగా భూమిలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. మొదట భూమి లోపల కరెంట్ తీగ ఉందని వీరు అనుకున్నారు. అయితే కప్పును సరిగ్గా పరిశీలించి చూడగా అందులో బంగారు నాణాలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న వెంటనే ఆ జంట లండన్‌లోని వేలం కంపెనీని సంప్రదించారు.


ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఆ ఇంటికి వెళ్లి... ఆ నాణేలు దాదాపు 300 ఏళ్ల నాటివని చెప్పారు. 1610- 1727 మధ్య కాలంలో వాడిన అరుదైన బంగారు నాణేలుగా పురావస్తు నిపుణులు గుర్తించారు. అంతేకాదు ఆ నాణేలు ఫియర్న్లీ, మీస్టర్స్ అనే ధనవంతుల కుటుంబానికి చెందినవని వాళ్లు తెలుసుకున్నారు. అనంతరం ఈ బంగారు నాణాలకు వేలంలో సుమారు ఏడు కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలుస్తుంది. ఇంత డబ్బును దక్కించుకున్న ఈ జంట వారి వివరాలను బయటపెట్టేందుకు అంగీకరించలేదంట. మొత్తానికి ఈ నాణేలు దొరకడం.. దొరికిన తీరు చాలా వింతగా అనిపిపంచినప్పటికీ.. ఈ నాణాలు మాత్రం చాలా అరుదంట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa