చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి తలకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా వైయస్ఆర్ సీపీని ఇంచు కూడా కదిలించలేరని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, ఎంగిలిమెతుకులకు ఆశపడే కుక్క చంద్రబాబు అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు బట్టలూడదీసి తరిమికొట్టారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ మేలు చేయలేని చవట సన్నాసి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.