కర్నూలు ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైసీపీ ఎంపీ సింగరి సంజీవ్‌కుమార్ డిమాండ్ చేశారు. పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ సంజీవ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా మహిళలు, విద్యార్థులు, న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిని ఉద్దేశించి బట్టలు ఊడదీసి కొడతామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా చేయాలని, అలా కాకుండా మోసపూరితంగా భూముల ధరలు పెంచుకునేందుకే అమరావతిని రాజధానిగా చేశారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని ఎంపీ సంజీవ్ కుమార్ చెప్పారు. ఇక, ప్రతిపక్ష పార్టీల నేతలు మానసిక ఒత్తిడితో ప్రజలను అవమానకరంగా మట్లాడుతున్నారని ఫైరయ్యారు.