మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వింత ఆచారం కొనసాగుతోంది. భాగ్తిపురలోని భైరవనాథ స్వామి ఆలయంలో ఇటీవల ఓ భక్తుడు 1351 రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పించాడు. అందులో గంజాయి, 40 రకాల మద్యం, 60 రకాల సిగరెట్లు ఉన్నాయి. అగరబత్తీలు, స్వీట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు, డ్రైఫ్రూట్లు, చాక్లెట్లు, ఫేస్ మాస్కులు ఉన్నాయి. ఇది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం అని స్థానికులు పేర్కొన్నారు.