రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజ్యసభ ఛైర్మన్ కు ఫిర్యాదు చేశాడు. స్థాయీ సంఘం ఛైర్మన్, ఎథిక్స్ కమిటీ, ప్యానల్ ఛైర్మన్ పదవుల నుండి తప్పించాలని ఆయన కోరారు. పెద్దల సభను, గౌరవాన్ని ఆయన దిగజారుస్తున్నారని, విజయసాయి ప్రవర్తన పెద్దల సభ గౌరవానికి తగినట్లుగా లేదన్నారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అని తెలిపారు.