ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని, ఇది ప్రజా ఉద్యమంగా మారాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాక్షించారు. ఈ ఉద్యమంలో రైతులు, వినియోగదారులు అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని ఆయన కోరారు. సేంద్రీయ వ్యవసాయంతో రైతుకు రాబడి, ప్రజలకు ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వాలు ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.