ఫుట్‌బాల్ మ్యాచ్ ఫిక్సింగ్పై సీబీఐ తాజాగా ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఇటీవల దేశంలో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో న్యూఢిల్లీలోని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రధాన కార్యాలయానికి సీబీఐ ఇటీవల వెళ్లింది. 5 ఫుట్‌బాల్ క్లబ్‌ల పెట్టుబడులపై సమాచారం సేకరించింది. వాటిలో సింగపూర్ ఫిక్సర్ విల్సన్ రాజ్ పెరుమాల్ పెట్టుబడులు పెట్టాడా అనే విషయంపై ఆరా తీసింది.