చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, ఫ్లూ లతో ప్రజలు సతమతం అవుతుంటారు. జలుబుతో ముక్కు రంద్రాలు బ్లాక్ అవడంతో చాలామంది ఆవిరి పడుతుంటారు. ఈ ఆవిరి పట్టే నీటిలో కొన్ని పదార్థాలను కలపడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నీటిలో వాము, పుదీనా కలపడం వల్ల వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో జలుబు త్వరగా తగ్గిపోతుంది. అలాగే తులసి ఆకులు, రాక్ సాల్ట్ వేయడం వల్ల కూడా జలుపు త్వరగా తగ్గుతుంది.