కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని పెద్ద చెప్పలికి వెళ్లే దారిలో గల అక్కదేవతల కాలనీలో వేప చెట్టుకు సోమవారం ఉదయం లుంగీతో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. మృతుడు అదే కాలనీకి చెందిన మార్పురి బాబు(51) గా గుర్తించారు. మృతునికి ముగ్గురు కుమారులు భార్య కలరు. హుటా హుటిన సంఘటన స్థలికి చేరుకున్న కమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి చర్మవ్యాధి ఉండడంతో ఇక బాగు కాదనే భయంతో మనస్థాపానికి గురై చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు కుమారుడు వినోద్ కుమార్ తెలిపారు. కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిన్న పెద్దయ్య తెలిపారు.