అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సూచనలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈవారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 438 పాయింట్ల నష్టంతో 61,224 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయి 18,184 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.84 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.