విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ 141 బంతుల్లో 277 పరుగులు చేశాడు. లిస్ట్ A క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. లిస్ట్ A క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ సిలో భాగంగా సోమవారం తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు యాభై ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 506 పరుగులు చేసింది.
జగదీషన్ 141 బాల్స్‌లో 15 సిక్సర్లు, 25 ఫోర్లతో 277 రన్స్ చేయగా మరో ఓపెనర్ సాయిసుదర్శన్ 102 బాల్స్‌లో 154 రన్స్ చేశారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 38.3 ఓవర్లలో 416 పరుగులు చేశారు. లిస్ట్ ఏ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం గమనార్హం. అంతేకాకుండా లిస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన క్రికెటర్‌గా జగదీషన్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రోహిత్ శర్మ (264 పరుగులు) పేరిట ఉండేది. అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్‌తో రోహిత్ శర్మ రికార్డును జగదీషన్ అధిగమించాడు. విజయ్ హజారే ట్రోఫీలో జగదీషన్‌కు ఇది వరుసగా ఐదో సెంచరీ. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా ఐదు శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ అతడే. గతంలో ఈ రికార్డ్ విరాట్ కోహ్లి, పృథ్వీ షా, దేవదత్ ఫడిక్కల్ పేరు మీద ఉంది. ఈ ముగ్గురు వరుసగా నాలుగు సెంచరీలు సాధించారు. 2008-09 ఎడిషన్ విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లి వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు.