వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి మాత్రమే బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. తాము టీడీపీతో కలవమని, పవన్ తో కలిసి ముందుకెళ్తామని, టీడీపీతో కలుస్తానని పవన్ కల్యాణ్ ఎక్కడా చెప్పలేదని తెలిపారు. పవన్ తమతోనే ఉండాలని, ఉండేటట్లు చేసుకుంటామన్నారు. కుటుంబ రాజకీయాలతో జరిగే నష్టాలను పవన్ కు వివరిస్తామని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.