బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆకాశంలో మబ్బులు కమ్ముకుని చల్లగాలులు వీస్తుతండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో రైతులు కోసిన వరి పంటను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. తుఫాన్ హెచ్చరికలతో హడావుడిగా ధాన్యం విక్రయించటానికి ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.