రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఎర్రచందనం, మైన్స్, ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ ప్రభుత్వమేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మాఫియాకు డాన్ ఎవరనేది చెప్పాల్సిన పనిలేదని, ప్రజలందరికీ బాగా అర్థమైందని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరు పంచాయతీ అక్కదేవతలకండిగలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ కేసులకు భయపడి ప్రధాని కాళ్లపై పడేస్థితికి రావడం రాష్ట్రానికి తలవంపేనన్నారు.