ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ ప్రయాణికులపై ఆ ఆంక్షలు ఎత్తివేత

national |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 12:11 AM

కరోనా రాకతో వివిధ దేశాలనుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు  విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మన భారతదేశం కూడా ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా విదేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో ఓ ఆన్ లైన్ ఫాం నింపాల్సి వచ్చేది. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారన్న వివరాలు ఆ ఫాంలో పొందుపరిచాలి. అయితే, కేంద్రం ఆ నిబంధనను సడలించింది. ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరంలేదు. ఈ ఆంక్షలు తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.


కొవిడ్-19 సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచవ్యాప్తంగానూ, భారత్ లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున అంతర్జాతీయ ప్రయాణికుల మార్గదర్శకాలు సవరించి, కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఓ నోటీసు విడుదలైంది. ఇకపై ఏ ప్రయాణికుడు కరోనా వ్యాక్సినేషన్ పై స్వీయ హామీ పత్రం ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం పేర్కొంది. అయితే, కరోనా కేసులు ఎక్కువైతే ఈ నిబంధన మళ్లీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com