రాజస్థాన్ లోని రాజసమంద్ జిల్లాలో నవరతన్ ప్రజాపత్ అనే పూజారిపై గుర్తు తెలియని దుండగులు పెట్టోల్ బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో పూజారితో పాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి హిరాకీ బస్తీలో తన నివాసంలో భోజనం చేస్తుండగా బలవంతంగా లోపలికి చొరబడి పెట్రోల్ బాంబు విసిరారు. ఈ కేసులో 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు బెదిరింపులపై పూజారి ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa