ప్రతిపక్ష నేత చంద్రబాబు పై వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రం భారీ స్కెచ్చే వేశాడు. అమరావతిని అంగీకరించాలంటూ ఉత్తరాంధ్రలో ఘర్షణలు లేపాలని చూస్తే, ప్లాన్ ఫ్లాప్ అయింది. కర్నూలు వెళ్లి తనే రెచ్చగొట్టే యత్నం చేసాడు. మీరు కడుపు మాడ్చుకుని మాకు కమ్మ’ని భోజనం వడ్డించండి అన్నట్టుంది చంద్రం వాలకం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.